• Login / Register
  • National News |తగ్గనున్నపెట్రోల్, డీజిల్ ధరలు

    కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆయిల్ కంపెనీలు
    గ్రామీణ మారుమూల ప్రాంతాల వినియోదారుల‌కు ప్ర‌యోజ‌నం అని ప్ర‌క‌ట‌న‌  

    Hyderabad :  దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు త‌గ్గ‌నున్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయిల్ కంపెనీలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించే డీలర్ కమిషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే  కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే నిల‌క‌డ‌గా కొనసాగుతున్నాయి. ఎలాంటి సవరణలు జరగలేదు. ఈ నిర్ణయంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న ఇంధన వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీలు ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్న‌ట్లు చెప్పుతున్నారు. ఈ మేరకు ఆయిల్ రవాణాకు సంబంధించిన అంతర్ రాష్ట్ర ఛార్జీలను కంపెనీలు స‌ర్దుబాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. దీని ప్ర‌భావంతో అంతర్-రాష్ట్ర రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించడం వ‌ల్ల‌  హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వం టి రాష్ట్రాల్లో  కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయ‌ని తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించ‌న పూర్తి వివ‌రాలు వెల్లడించాల్సి ఉంది.
    *  *  * 

    Leave A Comment